
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ఫ మర్రిగూడ మండలం
ఇందూర్తి గ్రామంలో ఘటన
మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని మేటిచందా పురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందూర్తి గ్రామంలో బుధవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామ పంచాయతీకి చెందిన బత్తుల చంద్రమ్మ, నర్సింహ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. వారి పెద్ద కుమారుడు బత్తుల సైదులు(25) ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడు. బుధవారం మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో తన బంధువుల ఇంటికి సైదులు వచ్చాడు. ఈ క్రమంలో సైదులు స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు పరిశీలించగా క్రిమిసంహారక మందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు. అయితే సైదులుది ఆత్మహత్య కాదని హత్యేనని అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మర్రిగూడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు.