
నిజామాబాద్‌కు బస్సు సౌకర్యం
రాజాపేట: యాదగిరిగుట్ట డిపో నుంచి రాజాపేట మండలంలోని రఘునాథపురం మీదుగా నిజామాబాద్‌కు ఆదివారం బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. బస్సుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. నిజామాబాద్‌కు బస్సు సౌకర్యం కల్పించినందుకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, గుట్ట డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా రజనీ
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్‌గా సీనియర్ అడ్వకేట్ రజనీని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను ఆమె వాదించనున్నారు. మూడేళ్ల పాటు అసిస్టెంట్ ప్లీడర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.