యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు | - | Sakshi
Sakshi News home page

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు

Jun 14 2025 6:33 AM | Updated on Jun 14 2025 6:33 AM

యాదగి

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ ఉన్న రింగ్‌ రోడ్డు మరొక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలువబోతుంది. ఇప్పటికే కొండ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించి, అందులో సర్కిల్స్‌, గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని రింగ్‌ రోడ్డులో ఆయా సర్కిల్స్‌లో సేదతీరేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే క్రమంలో ఉన్న సర్కిల్స్‌కు ఏవిధంగా అయితే నామకరణాలు చేశారో.. ఇప్పుడు యాదగిరి కొండ కింద ఉన్న సర్కిల్స్‌కు సైతం దేవుళ్ల పేర్లను అధికారులు పెట్టారు.

మూడు, నాలుగు నెలల్లో విగ్రహాల ఏర్పాటు..

తిరుమల తిరుపతి తరహాలోనే యాదగిరి కొండకు దిగువన ఉన్న సర్కిల్స్‌కు నామకరణం చేశారు. ఇందులో వైకుంఠద్వారం వద్ద ఉన్న సర్కిల్‌కు శ్రీ అభయాంజనేయ, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ వెళ్లే దారిలో ఉన్న సర్కిల్‌కు గరుడ, కొండపైకి వెళ్లే ఎగ్జిట్‌ ప్‌లై ఓవర్‌ (ప్రస్తుతం మూడో ఘాట్‌రోడ్డు ప్రారంభంలో) వద్ద ఉన్న సర్కిల్‌కు రామానుజ, యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వెళ్లే దారిలో ఉన్న సర్కిల్‌కు యాదర్షిగా నామకరణం చేశారు. ఈ నామకరణం చేసిన సర్కిళ్లలో ఆయా దేవుళ్ల విగ్రహాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈఓ వెంకట్రావ్‌ ఆలయ అర్చకులు, స్తపతులతో వాస్తు, ఆగమశాస్త్ర అంశాలపై చర్చించారు. మూడు, నాలుగు నెలల్లో విగ్రహాల ఏర్పాటు పూర్తి చేస్తామని ఈఓ చెబుతున్నారు.

రింగ్‌ రోడ్డులో భాగంగా..

యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి, పునః నిర్మాణంలో భాగంగా కొండ చుట్టూ సుమారు 5.2 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డును విస్తరించారు. ఇందుకుగాను గత ప్రభుత్వం రూ.235.7 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో భూ సేకరణతోపాటు రింగ్‌ రోడ్డు విస్తరణ, ఎంట్రీ, ఎగ్జిట్‌ ఫ్‌లైఓవర్స్‌, గ్రీనరీ, డ్రైనేజీతోపాటు నాలుగు దిక్కులు నాలుగు సర్కిళ్ల ఏర్పాటుకు ఈ నిధులు ఖర్చు చేశారు. వైకుంఠద్వారం, మల్లాపురం వెళ్లే రహదారి, కొండపైకి ఎక్కడానికి ఏర్పాటు చేసిన మూడో ఘాట్‌ రోడ్డు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్లే మార్గంలో ఈ సర్కిళ్లను ఏర్పాటు చేసి, అందులో రకరకాల పుష్పాలతో భక్తులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. ఈ సర్కిళ్లకే దేవుళ్ల పేర్లు పెట్టారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా..

స్వామివారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆయా సర్కిల్స్‌ వద్ద ఆగిపోతున్నారు. వైకుంఠద్వారం నుంచి రింగ్‌ రోడ్డు చుట్టూ తిరుగుతూ ఆలయానికి, కల్యాణకట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం, తులసీ కాటేజీ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే దారి తెలియక, రింగ్‌ రోడ్డులో ఏ సర్కిల్‌ వద్ద ఉన్నామో తెలియక తికమక పడుతున్నారు. దీంతో ఆలయ ఈఓ వెంకట్రావ్‌ రింగ్‌ రోడ్డులో ఉన్న సర్కిల్స్‌ కు వివిధ దేవుళ్ల పేర్లు పెడితే భక్తులు ఎక్కడ ఉన్నారో తమ కుటుంబ సభ్యులకు తెలిపేందుకు సులువుగా ఉంటుందని సర్కిల్స్‌కు నామకరణం చేశారు. వైకుంఠద్వారం వద్దకు వచ్చిన వారికి ఏ సర్కిల్‌ వద్దకు వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్తాం అనే వివరాలు సులువుగా తెలిసే అవకాశం ఉంది.

ఫ తిరుమల తరహాలో నామకరణం

ఫ యాదగిరి కొండ చుట్టూ

నాలుగు సర్కిల్స్‌

ఫ దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు1
1/3

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు2
2/3

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు3
3/3

యాదగిరికొండ సర్కిళ్లకు దేవుళ్ల పేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement