
క్వాంటం వ్యాలీ హేకథాన్ పోటీలు
భీమవరం: ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అమరావతి క్వాంటం వ్యాలీ హేకథాన్ 2025 సెమీఫైనల్స్‌లో విజేతలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్స్‌గా భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీ విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్, రాజమండ్రి, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి, ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సూరంపాలెం, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెం, ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫర్ ఉమెన్ రాజమండ్రి, ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీ కాకినాడ వారికి దక్కగా, ఒక్కొక్క టీంకి రూ.10 వేల చెక్కును కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందించారు. రన్నర్స్‌గా నిలిచిన కళాశాలలకు ఒక్కొక్క టీంకు రూ.5 వేల చొప్పున అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు ఉన్నత విద్యా మండల్ నుంచి ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ పి అనిల్‌కుమార్ హాజరుకాగా రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, ఉపాధ్యక్షుడు ఎస్వీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.