
బాబు వంచనపై పోరుబాట
రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ
శురకవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కూటమి ప్రభుత్వం వంచనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలుగాని, సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయని వైనంపై ప్రజా క్షేత్రంలో నిరంతర ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ పిలుపుమేరకు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ పేరుతో ఉమ్మడి పశ్చిమగోదావరిలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాస్థాయి సన్నాహాక సమావేశాలు శుక్రవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ రెండు జిల్లాలో జరిగే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.
బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కార్యక్రమంపై సన్నాహక సమావేశం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కొండలరావుపాలెంలో దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరంలోని ఆనంద్ ఇన్‌లో నిర్వహించనున్నారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజుతోపాటు పార్టీ ముఖ్యులు, మండల నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం పశ్చిమగోదావరిలో జరిగే సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు గుడాల గోపి, చినిమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజుతో పాటు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
న్యూస్‌రీల్
దెందులూరులో టీడీపీ చిల్లర రాజకీయాలు
ఏలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడానికి అధికార టీడీపీ చిల్లర రాజకీయాలకు తెరతీసింది. తొలుత పెదపాడు మండలంలోని వట్లూరులోని శ్రీకన్వెన్షన్‌లో సమావేశాన్ని ఖరారు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి చిల్లర రాజకీయాలతో కన్వెన్షన్ నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి సమావేశాన్ని అక్కడ జరగకుండా అడ్డుకున్నారు. అలాగే మరో రెండు ఫంక్షన్ హాల్స్‌కు కూడా ముందుస్తు హెచ్చరికలు జారీ చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వేదికను పెదవేగి మండలంలోని కొండలరావుపాలెంలోని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
దగాపై ధర్మాగ్రహం
‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ పేరిట వైఎస్సార్ సీపీ నిలదీత
నేడు జిల్లాస్థాయి సమావేశాలకు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స హాజరు
ఉదయం కొండలరావుపాలెంలో ఏలూరు జిల్లాస్థాయి..
మధ్యాహ్నం భీమవరంలో ‘పశ్చిమ’ జిల్లాస్థాయి సమావేశం
రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో ఆవిష్కరణ
ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా రెండు జిల్లాల్లో జరిగే సమావేశాల్లో మేనిఫెస్టో పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమం నిర్వహించాల్సిన తీరు విధి విధానాలపై శ్రేణులకు వివరించనున్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు, రాష్ట్రస్థాయిలో లెక్కకు మించిన హామీలు, జిల్లా స్థాయిలో పదుల సంఖ్యలో హామీలిచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, ఎన్నికల సమయంలో ప్రతి పథకానికి ఎంత నగదు కుటుంబానికి జమ అవుతుందో వివరిస్తూ టీడీపీ ఇచ్చిన ఎన్నికల బాండ్ల మోసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఐదు వారాలు పాటు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా 4వ తేదీన దెందులూరు, 5న చింతలపూడి, పోలవరం, 6న నూజివీడు, 7న ఉంగుటూరు, 8న కై కలూరు, 10వ తేదీన ఏలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ ముఖ్యులు నిర్ణయించారు.

బాబు వంచనపై పోరుబాట

బాబు వంచనపై పోరుబాట