
తీరంలో తాగునీటికి కటకట
దోమలపై దండెత్తరే?
వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. 8లో u
నరసాపురం రూరల్: నరసాపురం మండలం మరితిప్ప గ్రామంలో కాలనీలో గత 8 నెలలుగా తాగునీరు అందకపోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు. గురువారం ఈ సమస్యపై స్థానిక ప్రజలు కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ బలహీన వర్గాల కాలనీ ప్రజలకు తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతంలో ఈ సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. వర్షాకాలంలో కూడా తాగునీటి సమస్యను పరిష్కారం చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం తాగునీటి సమస్య పరిష్కారం కాకపోతే గ్రామ సచివాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యురాలు గుబ్బల జయలక్ష్మి, నాగళ్ల వరలక్ష్మి, గుబ్బల లక్ష్మి, దాసరి పద్మ, గుబ్బల మౌనిక, గంగుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.