
అప్రమత్తతతో రక్తహీనత దూరం
జంగారెడ్డిగూడెం: రక్తహీనత అనేది మనుషులతో పాటు పశువులనూ ఇబ్బంది పెట్టే ప్రధాన వ్యాధి. పశువుల విషయానికి వస్తే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల రక్తంలో ఆమ్లజనకం సరఫరా తగ్గిపోవడం వల్ల రక్తహీనత వేధిస్తుంది. రక్తహీనత వల్ల పశువులు మేత మానేసి, పనిలో బలహీనత ఉంటాయి. దీంతో ఆవులు, గేదెల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. రక్తహీనత తగ్గించే చర్యలు చేపట్టి పాడి అభివృద్ధిని మెరుగుపరిచే సూచనలు, సలహాలు పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు.
రక్తహీనత లక్షణాలు
బలహీనత, అలసట, తెల్లబడ్డ లేదా పసుపు కొమ్ములు, మేత, నీరు తీసుకునే అలవాటు తగ్గిపోవడం, శ్వాసకష్టం, బరువు తగ్గడం, పని సామర్థ్యం తగ్గిపోవడం
చికిత్స విధానాలు
● అల్లోపతి విధానంలో : తీవ్ర రక్తహీనతకు రక్త మార్పిడి అవసరం కావచ్చు.
● ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి.
● కీటకాల నివారణ, పరాన్నజీవాల మీద కట్టడి చేయడం ద్వారా రక్తహీనత నివారించవచ్చు.
● బాక్టీరియా లేదా పకిటీరియా సంక్రమణకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి.
నేచురోపతి విధానంలో..
● పచ్చ కూరలు, ఆకుకూరలు, ఆహారంలో ఇనుమును ఐరన్‌ను చేర్చాలి.
● హెర్బల్ చికిత్సా విధానంలో నెటిల్, స్పిరులినా వంటి ఐరన్ అధికంగా ఉన్న ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.
● ఆక్యు పంక్చర్ విధానంలో చికిత్స రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
హోమియోపతి విధానం
ఫెర్రఫోస్పోరికమ్ చికిత్సలో రక్తహీనత ప్రారంభ దశలో ఉత్పత్తి స్థాయిలు పెంచడానికి ఉపయోగపడుతుంది. చైనా ఆఫిసినాలిస్ చికిత్సలో రక్త పోత తర్వాత రక్తహీనత ఉన్న జంతువులకు ఇది ఇవ్వవచ్చు. నాట్రమ్ మురియాటికమ్ చికిత్సలో జిగురు తగ్గిన రక్తహీనతకు ఉపయోగపడుతుంది. ఆర్సెనికమ్ ఆల్బమ్ చికిత్సలో తీవ్ర బలహీనత, శ్వాసకష్టం ఉన్న రోగులకి ఇది ఇవ్వవచ్చు.
చికిత్సతో రక్తహీనత దూరం
రక్తహీనతకు సమయానుకూలంగా చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యం. అల్లొపతి, నాచురోపతి, హోమియోపతి పద్ధతులను సమ్మిళితం చేసి, వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే, రోగం నుంచి కోలుకోవడం సులభం.
– బీఆర్ శ్రీనివాసన్, పశు వైద్యాధికారి
పాడి–పంట

అప్రమత్తతతో రక్తహీనత దూరం

అప్రమత్తతతో రక్తహీనత దూరం