కాంట్రాక్టర్లకు బిల్లుల బెంగ | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లకు బిల్లుల బెంగ

Jul 4 2025 3:30 AM | Updated on Jul 4 2025 3:30 AM

కాంట్

కాంట్రాక్టర్లకు బిల్లుల బెంగ

భీమవరం (ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఏడాది కాలంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే పెద్ద మునిసిపాలిటీ, గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీగా ఉన్న భీమవరం మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులు ఉన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. భీమవరం మునిసిపాలిటీలో రెగ్యులర్‌గా పనులు చేసే కాంట్రాక్టర్లు 30 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్క కాంట్రాక్టరుకు రూ.లక్షల్లో బిల్లులు బకాయి ఉండడంతో మళ్లీ పనులు చేసే పరిస్థితి వారి దగ్గర లేదు. ఇక్కడ కాంట్రాక్టర్ల బిల్లులు బకాయిలు చూసి బయట కాంట్రాక్టర్లు సైతం భీమవరం మునిసిపాలిటీ అంటేనే బిల్లులు రావు అని భయపడుతున్నారు.

ఏడాదిగా చెల్లింపు నిల్‌

గత ప్రభుత్వంలో చివరి ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో ఒకటి రెండు పనులు కలుపుకుని భీమవరం మునిసిపాలిటీలో చేసిన 446 పనులకు సంబంధించి రూ.33.50 కోట్లు బిల్లుల బకాయి ఉంది. అందులో మునిసిపాలిటీ సాధారణ నిధులతో చేసిన 111 పనులకు సంబంధించి రూ.16 కోట్లు, మెయింట్‌నెన్స్‌ నిధులతో చేసిన 222 పనులకుగాను రూ.5 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన 7 పనులకుగాను రూ.2.5 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిల చెల్లింపులో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది. దీంతో పట్టణంలో సీసీరోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, అఖరికి డ్రెయిన్ల బాగుచేత పనులు సైతం జరగడం లేదు. వాటికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. పెండింగ్‌ బిల్లులు కోసం నిత్యం మునిసిపాలిటీ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.

అన్న క్యాంటీన్ల ఆధునికీకరణ బిల్లులు లేవు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం పట్టణంలో మూడు అన్న క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించడానికి వాటి ఆదునికీకరణ పనులను కాంట్రాక్టర్లు చేత చేయించింది. మూడు క్యాంటీన్‌లలో రెండు రూ.6 లక్షల చొప్పున, ఒకటి రూ.8 లక్షలతో అభివృద్ధి చేయించింది. వాటి బిల్లులు రూ.20 లక్షలు కూడా చెల్లించలేదు.

గత ప్రభుత్వంలో రూ.130 కోట్ల పనులు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో తీర్మానం చేసిన పనులకుగాను ఏడాది కాలంలోనే రూ.30 కోట్లు చెల్లించారు. సకాలంలో వారికి బిల్లులు చెల్లించడంతో గత 5 ఏళ్ల పాలనలో భీమవరం మునిసిపాలిటీలో రూ.130 కోట్ల పనులను కాంట్రాక్టర్లు పూర్తిచేశారు. ప్రస్తుతం భీమవరం మునిసిపాలిటీకి కోట్ల ఆదాయం ఉన్నా బిల్లులు చెల్లించడానికి కూటమి ప్రభుత్వానికి మనస్సు రావడం లేదు. ఇదే తీరు కొనసాగిస్తే మునిసిపాలిటీ అభివృద్ధి తిరోగమనం పడుతుంది. కాంట్రాక్టర్లు కడుపు మండి రోడ్డు ఎక్కే పరిస్థితి రాకముందే వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వారికి వెంటనే బకాయిలు చెల్లించాలని పలువురు కోరుతున్నారు.

కాంట్రాక్టర్లకు రూ.33.50 కోట్ల బకాయిలు

అన్న క్యాంటీన్‌ ఆధునికీకరణ పనులకూ బిల్లుల్లేవు

కొత్త పనులు చేసేందుకు ముందుకు రాని వైనం

భీమవరం మునిసిపాలిటీలో కుంటుపడిన అభివృద్ధి

అప్పుల ఊబిలోకి కాంట్రాక్టర్లు

కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లించకుండా వ్యహరిస్తున్న తీరుతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీకి అప్పు తెచ్చి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోయే సరికి తీసుకున్న అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం ఇలా సతమతం అవుతున్నారు. కొందరు ఇంటిలో బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పనులు పూర్తిచేశారు. బిల్లులు రాకపోవడంతో తనఖా పెట్టిన బంగారం, ఆస్తుల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

కాంట్రాక్టర్లకు బిల్లుల బెంగ1
1/1

కాంట్రాక్టర్లకు బిల్లుల బెంగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement