
పిడుగులతో అప్రమత్తం
వర్షాకాలంలో పిడుగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణాపాయంతో పాటు గృహోపకరణాలు కాలిపోయే ముప్పు ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 10లో u
ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ అమానుషం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్ల పాలనలో ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తుందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ మంగళవారం యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను కాలరాస్తూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక , ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై జులై 9న జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బారావు, దుర్గారావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.