
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
వేసవిలో పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మే 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం పలువురు పీఈటీ, పీడీ, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాము. నెలరోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాల్లో పిల్లలు ఆటలు నేర్చుకునేందుకు బాల్స్, హాకీ స్టిక్స్, నెట్స్ తదితర క్రీడాపరికరాలు అందిస్తాం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తాం. శిక్షణ తర్వాత పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. – బి శ్రీనివాసరావు, డీఎస్డీఓ