కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘ సభ్యులు డైరెక్టర్‌కు అందజేశారు. 8లో u
టిడ్కో ఇళ్ల కోసం..
భీమవరానికి చెందిన కుసుమంచి పద్మావతి, లక్కోజి సుధ పేదలు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వారికి కేవలం రూ.500తో టిడ్కో ఇళ్లు కేటాయిస్తూ పట్టాలు కూడా ఇచ్చారు. అయితే అధికారులు ఇప్పటివరకు టిడ్కో ఫ్లాట్లు కేటాయించలేదు. దీంతో కూలీ పనులపై జీవించే తాము ఇంటి అద్దె, కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, టిడ్కో ఇళ్లు ఇస్తే సొంతింటి కల నెరవేరుతుందని, అద్దె భారం తగ్గుతుందని కలెక్టర్‌ను కలిసి వారు మొరపెట్టుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదు
మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వీరభద్రరావు అవినీతికి పాల్పడటంతో ప్రభుత్వం బదిలీ చేసింది. ఉన్నతాధికారుల విచారణలో కూడా సబ్ రిజిస్ట్రార్ తప్పు చేశారని రుజు వైనా సస్పెండ్ చేయడం లేదని, వీరభద్రరావు మరలా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్‌గా రావాలని ప్రయత్నం చేస్తున్నారని బీసీ సేవా సంఘ జిల్లా అధ్యక్షుడు కముజు నాగ వెంకట ప్రసాద్, జిల్లా కో–ఆర్డినేటర్ వేలూరి రంగబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వీరభద్రరావును సస్పెండ్ చేయాలని కోరారు.
గిట్టుబాటు ధర ఇవ్వాలి