గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
ఎంజీఎం సూపరింటెండెంట్ ఎవరు?
ఎంజీఎంలో పది రోజులు దాటినా సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయకపోవడంతో పాలన గాడి తప్పుతోంది.
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది.
ములుగు ఎందుకు ప్రత్యేకమంటే..
ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో
అగ్రస్థానం
● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం
● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు
● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద
● మూడు జిల్లాలకు పర్యావరణ గండం
పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం
ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు,
వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి.
– డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్‌ఓ, పర్యావరణ నిపుణుడు
మహబూబాబాద్
ములుగు
హనుమకొండ
జనగామ
భూపాలపల్లి
వరంగల్
భౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ)
అటవీ విస్తీర్ణం (చ.కి.మీ)


