
క్లినిక్‌లలో తెలంగాణ వైద్య మండలి తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి విద్యార్హతలు లేకుండా వైద్యం అందిస్తున్న క్లినిక్‌లలో వైద్య మండలి (టీజీఎంసీ) సభ్యులు ఆదివారం తనిఖీలు నిర్వహించినట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ వి.నరేశ్‌కుమార్ తెలిపారు. కేయూ క్రాస్ రోడ్డులోని అమైరా క్లినిక్ (డెర్మటాలజీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, పీఆర్‌పీ థెరపీ, లేజర్ థెరపీ)లో విద్యార్హతలు లేకుండా ఎండీ డెర్మాటలజీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చదివిన వైద్యులు అందించే చికిత్సలను నిర్వాహకులు ఫజషై క్, ఇమ్రా న్ ఖాన్ అందిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. భీమారంలోని శ్రీని వాస్ క్లినిక్‌ను నిర్వాహకుడు ఇ.శ్రీనివాస్ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గు ర్తించారు. ఎర్రగట్టుగుట్టలోని ఎస్‌ఆర్‌ఆర్ డ యాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకుడు బి.అనిల్ కూడా ల్యాబ్ టెక్నీషియన్, డయాగ్నొస్టిక్ సెంటర్ అనుమతి లేకుండా, వైద్యుల పర్యవేక్షణ లేకుండానే సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తనిఖీ ల్లో గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమో దు చేసేందుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ముగ్గురు నకిలీ వైద్యులపై
కేసు నమోదుకు సిఫార్సు