 
															దివ్యాంగుల సేవలో ‘గురుదేవా’
● సౌత్‌ఏషియన్ ఎల్‌పీజీ సంస్థ సీఈఓ రిచాషిండే
● దివ్యాంగులకు కృత్రిమ అవయవాల
పంపిణీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగుల సేవలో పరితపిస్తోందని సౌత్‌ఏషియన్ ఎల్‌పీజీ సంస్థ సీఈఓ రిచాషిండే కొనియాడారు.ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఆధ్వర్యలో సౌత్‌ఏషియన్‌ఎల్‌పీజీ సంస్థ సహకారంతో 250 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్‌చైర్స్, ట్రైసైకిల్స్, పోలియో కాలిపర్స్, వాకర్స్, చెవిటి మిషన్‌లు తదితర ఉపకరణాలను గురువారం అందజేశారు. ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని సౌత్‌ఏషియన్‌ఎల్‌పీజీ సంస్థ ప్రతినిధి రామనాథ్‌తో కలిసి సీఈఓ సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో పేదలు, దివ్యాంగులకు అందుతున్న సేవలను ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు వారికి వివరించారు.అనంతరం రిచాషిండే మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టమని, భగవంతుడికి చేస్తున్న సేవగా భావించాలన్నారు. ఆ అదృష్టం చారిటబుల్ ట్రస్టు చైర్మన్ జగదీష్‌బాబుకి దక్కిందన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యుడు డాక్టర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
