
● సర్వేయర్ల నిరసన బాట
సమస్యల పరిష్కారం కోరుతూ సచివాలయ సర్వేయర్లు రోడ్డెక్కారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన గళం వినిపించారు. జీఓ నంబర్ 5ను సవరించాలని, గుమస్తాకంటే తక్కువ ఉద్యోగాలకు గెజిటెడ్ ఉద్యోగుల స్థాయి నిబంధనలు విధించడం తగదన్నారు. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని కోరారు. పనిభారం ఉన్నా ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం విచారకరమన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం