
ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం
ప్రతి స్కూల్ బస్సుకు సంబంధిత పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా ఫిట్‌నెస్ చేయించాలి. లేకపోతే అటువంటి బస్సులను తిరగనిచ్చే ప్రసక్తే లేదు. పాఠశాల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకుని బస్సులు నడపాలి. పాఠశాలలు ప్రారంభం నాటి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం. 15 ఏళ్లు దాటిన బస్సులు, 15 ఏళ్లకు దగ్గరగా ఉన్న బస్సులు తుక్కుగా అమ్మేసి వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దుచేసుకోవాలి.
– మణికుమార్,
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, విజయనగరం