
9వ తేదీ నుంచి డ్యూటీకి రావద్దన్నారు
ఈ నెల 8వ తేదీ వరకు పనిచేశాను. 8వ తేదీ సాయింత్రం ఫోన్ చేసి 9వ తేదీ నుంచి డ్యూటీకి రావద్దని చెప్పారు. 2022 నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఏం చేయాలో తెలియడం లేదు.
– దాలమ్మ, పారావెట్, గంట్యాడ
ఉద్యోగం నుంచి తీసేశారు..
2022 నుంచి సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలో పనిచేస్తున్నాను. 8వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి 9వ తేదీ నుంచి ఉద్యోగానికి రావద్దని చెప్పారు. ఉన్న పళంగా ఉద్యోగం తీసేస్తే ఏలా బతకాలి. ఇప్పడు మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి. చాలా అన్యాయం.
– గణపతి, డ్రైవర్, బొబ్బిలి
సంస్థ సూచనల మేరకే..
సంస్థ హెచ్ఆర్ విభాగం నుంచి ఎవరిని ఆపేయాలో వారి పేర్లు పంపిస్తున్నారు. దానికి అనుగుణంగా వారిని నిలిపివేస్తున్నాం.
– గెంబలి గంగరాజు, ప్రొగ్రాం మేనేజర్, భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థ

9వ తేదీ నుంచి డ్యూటీకి రావద్దన్నారు