
డ్రోన్ సహాయంతో ఓపెన్ డ్రింకింగ్‌కు అడ్డుకట్ట
● వన్‌టౌన్ పీఎస్ పరిధిలో 6 కేసులు
● టూటౌన్ పరిధిలో 11 కేసుల నమోదు
విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధి విజయనగరం వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఆదివారం ఓపెన్ డ్రింకింగ్‌కు పోలీసులు చెక్ పెట్టారు. డ్రోన్స్ సహాయంతో రైడ్స్ నిర్వహించి, ఓపెన్ డ్రింకింగ్‌కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. టూటౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పూల్‌భాగ్ కాలనీ నందిగుడ్డి ప్రాంతంలోను, 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కణపాక, అయ్యన్నపేట ఏరియాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై డ్రోన్స్ పంపారు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఓపెన్ డ్రింకింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించి పోలీసులు రైడ్స్ నిర్వహించారు. వన్ టౌన్ పోలీసు స్టేషను వరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై ఆరు కేసులు, టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై 11 కేసులను నమోదు చేశామని ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పేకాట, ఓపెన్ డ్రింకింగ్, ట్రాఫిక్ రెగ్యులేషన్, జాతర్లు, ధర్నాల నిర్వహణలో అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీని కనిపెట్టేందుకు డ్రోన్ వినియోగిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ వినియోగించాలని, శివారు ప్రాంతాలపై నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.