
తూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం
భోగాపురం: మండలంలోని తూడెం గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తూడెం గ్రామానికి చెందిన నీలాపు ఆదమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి పూరింటిలో ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ కావడంతో ఆదమ్మ గమనించలేదు. వంట చేసేందుకు స్టౌ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రూ.2 లక్షలకు పైబడి నగదు, విలువైన వస్తువులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు గాలి రాజారెడ్డి రూ.5వేల నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. రెవెన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు.