పరిపూర్ణ ఆరోగ్యానికి యోగ సౌభాగ్యం | - | Sakshi
Sakshi News home page

పరిపూర్ణ ఆరోగ్యానికి యోగ సౌభాగ్యం

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

జీవనశైలి వ్యాధులకు యోగాతో సమర్థ పరిష్కారం ఒక్కో ఆసనంలో వందలాది ఆరోగ్య ప్రయోజనాలు వయోభేదం లేకుండా సాధన చేస్తే ప్రశాంత జీవనం నగరంలో ఉచిత యోగా శిక్షణకు పెరుగుతున్న ఆదరణ

ఉరుకుల పరుగుల జీవితం.. నిరంతర ఒత్తిడి.. చిన్న వయసులోనే ఊబకాయం.. వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ల వంటి జీవనశైలి వ్యాధులు మనిషి ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్నాయి. అయితే

వీటన్నింటినీ ఎదుర్కొనే సమర్థ మార్గం యోగానేనని యోగా సాధకులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగా, ఆధునిక

జీవనశైలికి అవసరమైన ఉత్తమ ఆరోగ్య సాధనగా మారిందంటున్నారు. ఏళ్ల తరబడి యోగా సాధన చేస్తున్న వారు తమ అనుభవాలను పంచుకుంటూ, వివిధ ఆసనాల ద్వారా పొందిన ప్రయోజనాలను వివరిస్తున్నారు. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. –ఎంవీపీ కాలనీ

మయూరాసనంతో జీర్ణశక్తి మెరుగుదల

నా వయసు 78 సంవత్సరాలు. గత కొన్నేళ్లుగా యోగ సాధన చేస్తున్నాను. మయూరాసనం వంటి క్లిష్టమైన ఆసనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

– టి.శాంతారాం, యోగా సాధకుడు, సీతమ్మధార

ఆరోగ్య సమస్యల నుంచి యోగా గురువుగా...

నాలుగేళ్ల క్రితం యోగాలో చేరే సమయానికి స్పాండిలైటిస్‌, గ్యాస్ట్రిక్‌, మలబద్ధకం, సైనసైటిస్‌ వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడిని. కనకరావు గురువు మార్గదర్శకత్వంలో యోగా శిక్షణ పొందిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ప్రస్తుతం ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం రావడం లేదు. యోగాపై ఆసక్తితో ఏయూ నుంచి యోగా పీజీ పూర్తి చేసి, ‘బ్లిస్‌ఫుల్‌ యోగా’ కేంద్రాన్ని స్థాపించి శిక్షణ అందిస్తున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక యోగా శిక్షణ కూడా ఇస్తున్నాను.

– ఎన్‌.వి.రమణ, కోక్‌ ఓవెన్స్‌ చార్జిమెన్‌, స్టీల్‌ప్లాంట్‌, యోగా గురువు

వెన్నెముక రక్షణకు భుజంగాసనం

న శరీరానికి వెన్నెముకే ప్రధాన ఆధారం. భుజంగాసనం సాధన ద్వారా వెన్నెముక కండరాలు బలపడటంతో పాటు స్నాయువులకు సాగుదల పెరుగుతుంది. గొంతు, ఉదర భాగాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. సులభంగా చేయగలిగే ఈ ఆసనం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరం.

–చించాలి నూతన్‌, విశ్రాంత స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement