యాదవులపై దాడిని ఖండిస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

యాదవులపై దాడిని ఖండిస్తున్నాం..

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

డాబాగార్డెన్స్‌: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఈదుమూడి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకులు, గొర్రెల కాపరులపై జరిగిన దాడులను వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నేతలు ఖండించారు. గురువారం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్‌ మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈదుమూడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు పల్లా దుర్గారావు, మహంతి పట్నాయక్‌, మువ్వల సురేష్‌, రామన్న పాత్రుడు, తుళ్లి చంద్ర శేఖర్‌, దేవరకొండ మార్కండేయులు, యడ్ల సుమన్‌, వడ్డాది దిలీప్‌, పోతిబంతి హరి కృష్ణ, బొండాడ వెంకటరావు, మజ్జి జ్యోతి, బాపూ ఆనంద్‌, గురజాపు రవి, దశమంతుల మాణిక్యాలరావు, కోన శంకర్‌, కె.సాగర్‌, రవికిరణ్‌, కోరాడ సురేష్‌, బెవర మహేష్‌, కోణతాల కృష్ణవేణి, చేపల నూకరాజు, రామలక్ష్మీ, మాదాబత్తుల రమేష్‌, రాము, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగం

అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement