
ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ప్రతినిధుల పర్యటన
నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం మండలంలో పర్యటించారు. కంపెనీ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను వారు పరిశీలించారు. అమలాపురం, డీఎల్ పురం, వేంపాడు, బోయపాడు తదితర గ్రామాల్లో స్టీల్‌ప్లాంట్ కోసం మొదటి విడతలో 2080 ఎకరాలను కేటాయించింది. జాతీయ రహదారి కాగిత నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీంతో కంపెనీ ప్రతినిధులు తమకు కేటాయించిన భూములను, అక్కడ ఏపీఐఐసీ వారు చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు స్టీల్‌ప్లాంట్ కోసం కేటాయించిన భూములు, వాటి వివరాలు, భౌగోళిక స్వరూపాన్ని కంపెనీ ప్రతినిధులకు చూపించారు. ముఖ్యంగా డీఎల్‌పురం వద్ద కంపెనీ నిర్మించే క్యాప్టివ్ పోర్టు పరిసరాలను పరిశీలించారు. వెసల్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం మొదటి విడతలో పోర్టు నిర్మాణం కోసం 168 ఎకరాలు అవసరం కానుంది. వీరి మిట్టల్ కంపెనీ ప్రతినిధుల వెంట తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఉన్నారు.