
రౌడీషీటర్ హత్య
మర్రిపాలెం : జ్ఞానాపురం శ్మశానవాటికలో రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అల్లిపురం ప్రాంతానికి చెందిన నాగమణి ఎల్లాజీ(35)పై గతంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ఎల్లాజీ జ్ఞానాపురం శ్మశాన వాటిక సిబ్బందితో మంగళవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తనతో తీసుకువచ్చిన పాకెట్ కత్తిని చూపించి బెదిరించాడు. దీంతో సహనం కోల్పోయిన సిబ్బందిలో ఒకరు చేతిలో ఉన్న గెడ్డపారతో ఎల్లాజీ తలపై బలంగా మోదడంతో రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అయితే మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించేందుకు సదరు సిబ్బంది పన్నాగం పన్నారని సమాచారం. ఈ క్రమంలో కంచరపాలెం పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని కేజీహెచ్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.