
వీఎంఆర్‌డీఏ ప్రాంగణాల్లో పనులు వేగవంతం
విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణం, గురజాడ కళాక్షేత్రంలో జరుగుతున్న మరమ్మతులు, నిర్వహణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన ఆయా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే, నిర్వహణ గుత్తేదారుడికి పలు మార్పులు, చేర్పులు చేయాల్సిందిగా సూచించారు. ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్‌ఈ భవానీశంకర్, ఈఈలు రామరాజు, దుర్గా ప్రసాద్, పరిపాలనాధికారిహేమంత్, సిబ్బంది పాల్గొన్నారు.