
15సార్లు ఫిర్యాదు చేశా..
నేను కోట వీధిలో నివసిస్తున్నాను. ఇంటి కోసం నేను ఇప్పటికి 15 సార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో దరఖాస్తు చేశా. భర్తతో విడాకులు అయ్యాయి. ఇద్దరు పిల్లలతో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు అనకాపల్లి, ఎన్.ఎన్.పురం వద్ద టిడ్కో ఇల్లు మంజూరైంది. దీనికి సంబంధించిన డబ్బులు కూడా కట్టాను, ఈకేవైసీ చేశారు, జియోట్యాగింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు జాబితాలో నా పేరు లేదు. పేరును ఎందుకు తొలగించారని పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేశా..ఎలాంటి సమాధానం రాలేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. నా లాంటి మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? దయచేసి నాకు ఇల్లు ఇప్పించండి. –షేక్ రహీమ్ తున్నీ, కోటవీధి