
ఉపాధి శిక్షణ తరగతులు ప్రారంభం
డాబాగార్డెన్స్: యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ, హైదరాబాద్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ద్వారకా బస్టేషన్ కాంప్లెక్స్ సమీపంలోని స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తరగతులు ప్రారంభించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సాలిడ్ వర్క్స్‌లో 30 మందికి, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ విభాగంలో 30 మందికి శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు ‘స్కిల్’ ఇన్‌స్టిట్యూట్ సీఈవో ఇంతియాజ్ అర్షద్, సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకట కృష్ణ తెలిపారు. నెల రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని, ఇంజినీరింగ్ డిప్లమో, బీటెక్/ఎంటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందిస్తామన్నారు. అలాగే స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లమో, బీటెక్/ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణ(కోర్సును బట్టి) నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఉంటుందని, ఇప్పటికే ఉపాధి పొందుతున్న వారు కూడా వారి నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించే వ్యక్తులకు తర్ఫీదు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 79950 14167లో లేదా www.sdivisakh.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.