
ఉత్సాహంగా యోగాంధ్ర
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకంలో భాగంగా నిర్వహిస్తున్న నెలరోజుల కార్యక్రమాలు ఆదివారం కూడా కొనసాగాయి. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా పతంజలి సంస్థ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం జరిగింది. వేదికపై నుంచి శిక్షకుల పర్యవేక్షణలో నగరవాసులు యోగాసనాలు వేశారు. జూన్ 21న విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.