
నేత.. మేత
వ్యర్థాల
● రూ.కోట్లు కొల్లగొడుతున్న ఓ చోటానేత ● అనధికారికంగా సేకరిస్తున్న ఓ జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ● ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు ● నెలవారీ మామూళ్లతో చెట్టాపట్టాలు ● పట్టుకున్న వాహనాలను వదిలేస్తున్న సిబ్బంది
బెదిరిస్తూ.... బలవంతంగా!
చికెన్ వ్యర్థాలతో చెడుగుడు
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ, జనసేన ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తుండటంతో అధికారులు మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఈ వ్యర్థాలతో పెంచిన రొయ్యలు, చేపలను ప్రజలు తినడం ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, జీవీఎంసీలోని ప్రజారోగ్య విభాగ అధికారులు ఈ చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపును చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖపట్నంలో చికెన్, మటన్ వ్యర్థాల అక్రమ తరలింపు వివాదాస్పదంగా మారింది. జీవీఎంసీ 8 జోన్లకు వ్యర్థాల సేకరణకు టెండర్లు కేటాయించినా, కూటమి నేతల పేరుతో కొందరు వ్యక్తులు అక్రమంగా వ్యర్థాలను సేకరిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా, వీరు తూర్పుగోదావరితో పాటు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లోని చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. పది మంది యువకులతో మూడు బొలెరో వాహనాల్లో బెదిరింపులకు పాల్పడుతూ వ్యర్థాలను సేకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, జనసేన, టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. జీవీఎంసీలోని ఓ అధికారికి నెలవారీగా భారీగా ముట్టచెబుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. చికెన్ వ్యర్థాలతో పెంచిన రొయ్యలు, చేపలు తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ప్రజారోగ్య విభాగ అధికారులు ఈ అక్రమ తరలింపును చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
విశాఖ చికెన్, మటన్ వ్యర్థాల అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. అక్రమంగా, అనుమతి లేకుండా జీవీఎంసీ పరిధిలో ఈ వ్యర్థాలను తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో జీవీఎంసీ అధికారులు కొన్ని వాహనాలను పట్టుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ వాహనాలను సీజ్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. దీనికి కూటమి ఎమ్మెల్యే అండదండలే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కోరాడ సాయి సుదర్శన్‌పై ఆరోపణలు
విశాఖ సిటీలోని ఓ జనసేన ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటున్న కోరాడ సాయి సుదర్శన్ ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు ఆరోపణలున్నాయి. లాసన్స్ బే కాలనీలో నివసించే సదరు వ్యక్తి, తన వెంట పది మంది యువకులను పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ షాపుల నుంచి అనధికారికంగా చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. మూడు బొలెరో వాహనాల ద్వారా ఈ వ్యర్థాలను తూర్పు గోదావరి జిల్లాలోని రొయ్యల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విధంగా కోళ్ల వ్యర్థాలతో కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం...!
జీవీఎంసీ పరిధిలో చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపు దందా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. ఈ వ్యర్థాలను సేకరిస్తున్న ముఠా వాటిని అధిక ధరలకు చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను మేతగా వేయడం వల్ల చేపలు, రొయ్యలు త్వరగా బరువు పెరుగుతాయని, మేత ఖర్చు కూడా తగ్గుతుందని చెరువుల యజమానులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. జీవీఎంసీ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అక్కడికక్కడే తొక్కేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ దందా జరుగుతున్నప్పటికీ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం, మత్స్యశాఖ, పోలీసుశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కాపులుప్పాడలో నిర్ణీత మొత్తంలో చికెన్ వ్యర్థాలు వస్తున్నాయా లేదా అని పరిశీలించాల్సిన అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యమై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని తెలుస్తోంది. చికెన్ వ్యర్థాలను తిన్న చేపలు, రొయ్యలను మనం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధ్యయనాల ప్రకారం, ఇటువంటి వ్యర్థాలను తిన్న రొయ్యలు, చేపలను తినడం వల్ల కాలేయ, జీర్ణకోశ సమస్యలు, న్యూరో సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, పేగులో పుండ్లు, మలబద్ధకం, పైల్స్ వంటి వ్యాధులు, ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఇది కారణమవుతుందని తేలింది. ఈ వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రాంతంలో గాలిలో వైరస్ వ్యాపించి, ఆ గాలి పీల్చితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే ఈ వ్యవహారంపై ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యర్థాల

నేత.. మేత