
ఆలయ కమిటీ దరఖాస్తుల పరిశీలన
తిరుపతి అర్బన్:ఆలయ కమిటీ ఏర్పాటుకు వచ్చి న దరఖాస్తులను పరిశీలన చేస్తున్నామని దేవాదాయశాఖ జిల్లా అధికారి పుట్టా రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న చిన్న ఆలయాలకు సైతం నూతన కమిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ మొదటివారం లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడాదికి రూ.కోటి ఆదాయం కన్నా తక్కువ రాబడి వచ్చే ఆలయ కమిటీల ఏర్పాటు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. తాజాగా రూ.కోటికి పైగా రూ.5 కోట్ల లోపు ఏడాదికి రాబడి వస్తున్న నాలుగు ఆలయాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయడానికి ఈనెల 27 వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశామని చెప్పారు. వాటి పరిశీలన త్వరలో పూర్తి చేస్తామని తర్వాత కమిటీల ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలో చిల్లకూరు మండలంలోని తమిళపట్నం కోదండరామేశ్వరాలయం, నాగలాపురం మండలంలోని సూరుటుపల్లికి చెందిన పల్లికొండేశ్వరస్వామి ఆలయం, తిరుపతి అర్బన్‌లోని తాతయ్యగుంట గంగమ్మ అలయం, చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరు ప్రాంతానికి చెందిన ముత్యాలమ్మ ఆలయాల్లో నూతన కమిటీలకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని వాటి పరిశీలన జరుగుతోందని వివరించారు.
అక్టోబర్‌లో డీఎల్‌డీఓ
కార్యాలయాల ప్రారంభం
గూడూరురూరల్ : డీఎల్‌డీఓ కార్యాలయాలను అక్టోబరులో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. గూడూరులోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు కానున్న డీఎల్‌డీఓ కార్యాలయ పనులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. జిల్లాలో 5 డివిజన్‌లలో డీఎల్‌డీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగు తోందన్నారు. గూడూరు డీఎల్‌డీఓ కార్యాల య పనులను తనిఖీ చేసి పనుల నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సెప్టెంబరు 15వ తేదీలోగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జె.మోహన్‌రావు, డీఎల్‌డీఓ వాణి, గూడూరు ఎంపీడీఓ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ దరఖాస్తుల పరిశీలన