
వృత్తి తెలుసుకోవాలి
మా అబ్బాయి ఈ ఏడాది 10వ తరగతి పాస్ అయ్యాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేర్పిస్తున్నాం. మాది లాండ్రీ షాపు. నేటి పిల్లలు తమ తల్లిదండ్రులు ఎలా సంపాదించి వారిని చదివిస్తున్నారో అర్థం చేసుకోవడం లేదు. కనీసంకులవృత్తిపైనా అవగాహన ఉండడం లేదు. అందుకే వేసవి సెలవులు కాబట్టి మా అబ్బాయిని షాపు దగ్గరకు తీసుకువస్తున్నా. మా వృత్తిపై అవగాహన కల్పిస్తున్నా. కష్టాన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల పిల్లలు మరింత కసితో ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగం సాధించేందుకు అవకాశముంటుంది.
– విద్యార్థి కార్తీక్‌తో తండ్రి నరసింహులు, లాండ్రీ షాపు, తిరుపతి