
కష్టం తెలుసుకోవాలనే..
మా అబ్బాయి ఈ ఏడాది 10వ తరగతి. నేను పండ్ల వ్యాపారం చేస్తుంటా. వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబ పోషణతోపాటు పిల్లలను చదివిస్తున్నా. నేను రూపాయిని ఎలా సంపాదిస్తున్నానో, ఫీజు ఎలా కడుతున్నానో, చేతిఖర్చులకు డబ్బు ఎలా ఇస్తున్నానో పిల్లలకు తెలియాలి. అందుకే ప్రతిరోజు మా అబ్బాయిని వెంట తీసుకుని వస్తున్నా. వేసవి సెలవులలో ఇంటి దగ్గర ఉంటూ సెల్‌ఫోన్ పట్టుకోవడం, స్నేహితులతో తిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. దీనికి అడ్డుకట్టవేసి తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వారు కొంతమేర అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. మా కష్టాన్ని చూసి బాగా చదువుకుంటాడనే మా ఆశ.
– విద్యార్థి చైతన్యతో తండ్రి టి.భానుప్రకాష్, పండ్ల వ్యాపారి, తిరుపతి