అనంతపురం: జేఎన్‌టీయూ (అనంతపురం)లో ఏపీ రీసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన పీహెచ్‌డీ సీట్లను ఈనెల 17న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బి.ఈశ్వరరెడ్డి తెలిపారు. ఏపీ రీసెట్–2022లో అర్హత సాధించి, సంబంధిత పీజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను తీసుకుని వర్సిటీ పాలకభవనంలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలు www. jntua. ac. in వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలన్నారు.