మృతదేహాల వెలికితీతకు రిజర్వాయర్‌లోకి దిగిన ఎస్‌ఐ

Yadadri Bhuvanagiri Rural Si Saidulu Braveness In Helping - Sakshi

ఆపదలో ఉన్నవారికి అండగా..

కరోనా కష్టకాలంలోనూ ఆపన్నహస్తం

 అధికారులు, ప్రజల మన్ననలు..

పొందుతున్న ఎస్‌ఐ కె.సైదులు

సాక్షి, యాదాద్రి : అధికారిగా ఆదేశాలిచ్చేకంటే తానే పనిలోకి దిగితే ఆదర్శవంతమైన ఫలితం ఉంటుందన్న అతని నమ్మకం సత్ఫలితాలనిచ్చింది.బాలుర మృతదేహాలను బయటకు తీయడానికి తానే  ధైర్యంగా రిజర్వాయర్‌లోకి దిగిన భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ సైదులుపై అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.కరోనా కాలంలోనూ అభాగ్యుల ఆకలితీర్చాడు. ప్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు సేవలందిస్తున్న భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ కె.సైదులుపై ప్రత్యేక కథనం 

రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకి
భువనగిరి కిసాన్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(14), హనుమాన్‌వాడకు చెందిన హేమంత్‌(15)సోమవారం సాయంత్రం భువనగిరి మండలం బస్వాపురం శివారులోని నృసింహ రిజ ర్వాయర్‌ను చూడటానికి వెళ్లి నీటిలో మునిగి పోయారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సైదులు అక్కడకు చేరుకున్నాడు. పిల్లల చెప్పులను చూసి రిజర్వాయర్‌లో మునిగిపోయారని ధ్రువీకరించుకున్నాడు.ఎన్‌డీఆర్‌ఎఫ్, గజ ఈత గాళ్ల కోసం సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని భావించి తానే రంగంలోకి దిగాడు. 15 ఫీట్ల లోతున్న నీటిలోకి దిగి మూడు గంటలు గాలించి బాలుర మృతదేహా లను బయటకు తీశారు.ఎస్‌ఐని బ స్వాపు రానికి చెందిన నాయకులు సత్కరించారు.

మతిస్థిమితం లేని కోటీశ్వరుడి గుర్తింపు  
హైదరాబాద్‌లోని బల్కంపేటకు చెందిన శ్రీ కాంత్‌ కోటీశ్వరుడు. 15 రోజుల క్రితం  రాయగిరికి వచ్చాడు. రోడ్ల పక్కన తిరుగుతుండటంతో ఎస్‌ఐ గమనించి చేరదీశాడు. వివరాలు  తెలుసుకోగా  అతడు కోటీశ్వరుడని తేలింది.  అతన్ని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాడు.  లాక్‌డౌన్‌లో.. కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లోనూ ఎస్‌ఐ సైదులు అనేక సేవలందించాడు.  వందలాది మంది అభాగ్యులకు సొంత ఖర్చుతో భోజనం అందిజేసి ఆకలి తీర్చాడు.  

నేనే ముందుంటా..
అధికారిగా తాను ముందుండి పనిచేయ డం ద్వారా మిగతావా రు కలిసి వస్తారు. బ స్వాపూర్‌ రిజర్వాయర్‌లో అదే చేశాను.గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చాను కాబట్టి నా కు ఈత వచ్చు. ఎన్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లకోసం ప్రయత్నించాం. కానీ,ఆలస్యం అవుతుందని భావించి నేనే రిజర్వాయర్‌లోకి ది గాను.ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశాను. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆధ్వర్యంలో కరోనా సమయంలో వందలాది మంది ఆకలి తీర్చాను. 
 –కె.సైదులు, ఎస్‌ఐ, భువనగిరి రూరల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top