ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

Telangana: MLC Kavitha Birthday Witnesses Grand Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఆదివారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంత్రి మహమూద్‌ అలీ, నిజామాబాద్‌ జిల్లా సిరికొండలో ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

కవిత మెట్టినిల్లయిన నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌లో జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు మేడె రాజీవ్‌ సాగర్‌ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి బాలబాలికలకు సైకిళ్లు అందజేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్త చిన్ని గౌడ్‌ అరేబియా సముద్రం ఒడ్డున మహబలేశ్వర్‌లో పడవలపై కవిత ఫోటోతో ఉన్న గులాబీ జెండాలను ఎగురవేశారు. ముంబాయి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద జాగృతి మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు శ్రీని వాస్‌ సల్గె ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జరపగా, జాగృతి కార్యదర్శి రోహిత్‌ దేశ రాజధాని ఢిల్లీలో గగనతలంలో ప్రత్యేక విమా నం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా మంత్రులు హరీష్‌ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు కవితకు శుభాకాంక్షలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top