కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్‌ అమ్మాయి.. అక్కడే మొగ్గ తొడిగిన ప్రేమ | Telangana Boy Ireland Girl Marriage In RangaReddy | Sakshi
Sakshi News home page

కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్‌ అమ్మాయి.. అక్కడే మొగ్గ తొడిగిన ప్రేమ

Dec 19 2022 8:38 AM | Updated on Dec 19 2022 2:08 PM

Telangana Boy Ireland Girl Marriage In RangaReddy - Sakshi

రంగారెడ్డి: కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్‌ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివరాలివీ. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంబరాజు చంద్ర ప్రకాష్ రావు, ఉషశ్రీ దంపతుల రెండో కుమారుడు రాహుల్‌ హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ చదివి సైక్రియాటిస్ట్‌లో పీహెచ్‌డీ చేశాడు. అనంతరం ఉద్యోగం నిమిత్తం ఆరేళ్ల క్రితం ఐర్లాండ్‌ దేశానికి వెళ్లాడు.

అక్కడ మెడికల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. రాహుల్‌కు అదే దేశానికి చెందిన ఎడ్మండ్‌ వాల్ష్, కార్మెల్‌ వాల్ష్ ల కూతురు క్లెయర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకునేందుకు ఇద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించారు. హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని వంగ అనంతరెడ్డి గార్డెన్‌లో ఆదివారం వారి వివాహం ఘనంగా జరిగింది. 

కల్యాణ మండపం కళకళ
వధువు క్లెయర్‌ తరఫున 60 మంది అతిథులు విమానంలో శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ అతిథుల రాకతో కల్యాణ మండపం కళకళలాడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం  వివాహం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement