Covid - 19, Lockdown Migrant Workers Not Interested To Workers - Sakshi
Sakshi News home page

కరోనా భయం.. పనులు చేయం!

May 25 2021 9:14 AM | Updated on May 25 2021 1:03 PM

Migrant Workers Not Interested To Work with Lockdown Fear - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగించలేమని కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు చేతులెత్తేస్తుండగా, మరోవైపు తమపై ఒత్తిడి పెట్టొద్దని బిల్డర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కార ణంగా చాలామంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో కార్మికుల కొరత ఏర్ప డింది. పనులను పర్యవేక్షించే పలువురు సిబ్బంది సైతం కోవిడ్‌ బారిన పడ్డారు.  

ఒకవైపు లక్ష్యం.. మరోవైపు కార్మికుల కొరత 
కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్లు, వాటి అనుబంధ కాల్వలు, పంప్‌హౌస్‌లు పనులను జూన్‌ 15 కల్లా పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను సీఎం ఆదేశించారు. వీటితోపాటే సీతారామ ఎత్తిపోతలలోని మూడు పంప్‌హౌస్‌లు, సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్, డిండిలోని ప్రధాన రిజర్వాయర్లు, పాలమూరు–రంగారెడ్డిలోని పంప్‌హౌస్‌ల పనులను జూలై, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సూచించారు. మొదటిదశలో చేపట్టిన 650 చెక్‌డ్యామ్‌ల పనులను వానాకాలం నాటికే పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో ని అన్ని ప్రాజెక్టుల్లో కలిపి సుమారు 10 వేల మంది నిపుణులైన కారి్మకులు పనిచేస్తుండగా చాలాచోట్ల కారి్మకులు కరోనా బారిన పడ్డారు. లాక్‌డౌన్‌ విధించడంతో కారి్మకులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు.  

ముగ్గురు ఇంజనీర్లు మృత్యువాత 
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు కొనసాగుతున్న కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు ప్రైవేటు ఏజెన్సీల ఇంజనీర్లు కరోనాతో మృత్యువాత పడ్డారు. మిగతా ప్రాజెక్టుల్లో కారి్మకుల కొరత ఏర్పడి పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తమపై ఒత్తిడి పెట్టొద్దని బిల్డర్స్‌ అసోసియేషన్‌ కూ డా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్, ప్రాజెక్టుల పరిధిలో కారి్మకుల కొరత, దాని ప్రభావంపై నివేదించాలని అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. 

ఒత్తిడి చేయొద్దు ప్లీజ్‌..! 
‘కరోనా భయంతో నిపుణులైన కారి్మకులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. సాంకేతిక సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఈ ప్రభావంతో పనులు నెమ్మదించాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనులు ముగించాలని మాపై ఒత్తిడి చేయొద్దని ఇంజనీర్లకు ఆదేశాలివ్వండి’ 
– సర్కార్‌కు బిల్డర్స్‌ అసోసియేషన్‌ లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement