రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ | Second Phase Of Telangana Gram Panchayat Elections 2025 Polling On Dec 14th Live Updates And Highlights Telugu | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

ఖమ్మం జిల్లాలో విషాదం.. సర్పంచ్‌ అభ్యర్థి మృతి

  • ఖమ్మం జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థి నాగరాజు మృతి
  • అనాసాగర్‌ సర్పంచ్‌ అభ్యర్థి నాగరాజు బ్రెయిన్‌ డెడ్‌
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నాగరాజు
2025-12-14 10:49:55

కొనాయిపల్లిలో ఉద్రిక్తత

మెదక్‌:

  • కొనాయిపల్లిలో  ఉద్రిక్తత
  • పంచాయతీ ఎన్నికల్లో ఇరువర్గాల ఘర్షణ
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
2025-12-14 10:42:27

ఓటర్లను ఆకట్టుకునేలా హరిత(గ్రీన్ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

వరంగల్ జిల్లా :

  • నర్సంపేట నియోజకవర్గంలో రెండవ విడుత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా దుగ్గొండి(మం) వెంకటాపూర్, దేశాయి పల్లి, నల్లబెల్లి(మం) నల్లబెల్లి, నందిగామ ఉన్నత పాఠశాలల్లో ఓటర్లను ఆకట్టుకునేలా హరిత(గ్రీన్ మోడల్) పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.
2025-12-14 09:59:21

తిప్పర్తి ఎంపీడీవో సుధాకర్ పై చర్యలు

నల్లగొండ జిల్లా: 

  • తిప్పర్తి ఎంపీడీవో సుధాకర్ పై చర్యలు
  • ఎన్నికల విధుల్లో అలసత్వం వహించడంతో పంచాయతీ రాజ్ కమిషనరేట్‌క సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
  • ఎన్నికల లెక్కింపు, పోలింగ్, ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని‌ ఎంపీడోవో ఆరోపణలు
2025-12-14 09:54:53

ఉదయం గం. 9 వరకూ..

నిజమాబాద్ 
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9.00 గంటల సమయానికి 20.49 శాతం పోలింగ్ నమోదు.

సూర్యాపేట జిల్లా
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 25. 18 శాతం పోలింగ్ నమోదు

నల్లగొండ జిల్లా
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 28.15 శాతం పోలింగ్ నమోదు
ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం.. 22.43 శాతం

కరీంనగర్ 
జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం.. 22.43
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20.27 శాతం
పెద్థపెల్లి 23.94 శాతం

సూర్యాపేట జిల్లా
రెండవ విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో (ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు ) మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

  • మోతె --27.37  %
  • చివ్వెంల ..26.66  %
  • మునగాల....27.03  %
  • నడిగూడెం... 21.51 %
  • పెనుపహాడ్..22.82  %        
  • కోదాడ... 24.58   %
  • అనంతగిరి.. 25.83  %            
  • చిలుకూరు..24.71  %          
  • జిల్లాలో పోలింగ్ సరాసరి..  25.18 %
2025-12-14 09:50:17

రెండో దశ ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్యేలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన స్వగ్రామం గండుగులపల్లి లోని పోలింగ్ కేంద్రంలో సాధారణ పౌరుడిగా ఓటర్ల తో కలిసి క్యూలైన్ లో నిలబడి వెళ్లి ఓటు వేశారు.
  • అటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లోని 7 వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో  ఓటు వేశారు.
2025-12-14 09:48:33

అవంచలో ఉద్రిక్తత

  • నాగర్‌కర్నూల్‌: తిమ్మాజీపేట మండలం అవంచలో ఉద్రిక్తత
  • సర్పంచ్‌ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
  • ఇద్దరికి గాయాలు.. జడ్చర్ల ఆస్పత్రికి తరలింపు
2025-12-14 09:03:39

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల :

  • జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు
  • జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం 101 గ్రామాలు
  • వీటిలో 9 గ్రామాలు ఏకగ్రీవంగా ఎంపిక..
  • మిగిలిన 92 గ్రామాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి..
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తూ జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వ్యాఖ్య..
  • నూటికి 90 శాతం వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారని విశ్వాసం..
2025-12-14 08:35:01

టవర్‌ ఎక్కిన సర్పంచ్‌ అభ్యర్థి

  • మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో టవర్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న నర్సంపల్లి పెద్ద తండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న శంకర్ నాయక్ అనే వ్యక్తి
  • తనను ఓడించేందుకు ప్రత్యర్థికి ఓటుకు 2000 రూపాయలు పంపిణీ చేస్తున్నారని టవర్ పైకి ఎక్కి నిరసన
  • గతంలో తాను సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయానని ఇప్పుడు కూడా తనను ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన
2025-12-14 08:32:29

కొనసాగుతున్న పోలింగ్‌

  • కొనసాగుతున్న రెండో విడత పోలింగ్‌
  • ఒంటి గంటవరకూ పోలింగ్‌
  • ఆపై ఓట్లక్కింపు

 

2025-12-14 07:46:34

మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్‌

  • పోలింగ్‌ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్‌ వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు
  • ఆపై విజేతలప్రకటన
  • ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌రాణి కుముదిని నిరంతరం పర్యవేక్షణ
2025-12-14 07:24:31

రెండో విడతలో... 

  • మొత్తం మండలాలు నోటిఫై: 193 
  • గ్రామ పంచాయతీలు నోటిఫై: 4,333 
  • వార్డులు నోటిఫై: 38,350 
  • పోలింగ్‌ స్టేషన్లు: 38,337 
  • రెండోదశలో ఓటర్ల సంఖ్య: 57,22,665 
  • పురుషులు: 27,96,006 
  • మహిళలు: 29,26,306 
  • ఇతరులు: 153 
  • పోలింగ్‌ జరగనున్న పంచాయతీలు: 3,911 
  • పోలింగ్‌ జరిగే వార్డులు: 22,917 
  • సర్పంచ్‌ అభ్యర్థులు: 12,782 
  • వార్డ్‌ మెంబర్‌ అభ్యర్థులు: 71,071 
  • ఆర్వోలు నియామకం: 30,661 
  • పోలింగ్‌ సిబ్బంది: 93,905 
  • మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడు దశల ఎన్నికలకు) వెబ్‌కాస్టింగ్‌ కోసం గుర్తించిన పోలింగ్‌ స్టేషన్లు: 3,769 
  • బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులో: 46,026 
     
2025-12-14 07:05:33

ఒక్కో సర్పంచ్‌ స్థానానికి సగటున 3–4 పోటీ 

  • రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్‌ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.
  • మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్‌ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్‌ చేశామని తెలిపింది.  
2025-12-14 07:03:25

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

  • తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికప్రారంభం
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌
  • 3,911 సర్పంచ్‌ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు
  • 29,917 వార్డులకు బరిలో నిలిచిన 71,071 మంది అభ్యర్థులు
  • ఇప్పటికే 415 సర్పంచ్‌ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
  • ఓటింగ్‌ పూర్తయ్యాక కౌంటింగ్‌.. విజేతల ప్రకటన
2025-12-14 07:01:32
Advertisement
 
Advertisement
Advertisement