ప్రతి రోజూ10లక్షలు..

Health Department Plans To Corona Vaccination 10 Lakhs Per A Day - Sakshi

తక్కువ రోజుల్లోనే ఎక్కువ మందికి 

కరోనా టీకా వేసేలా వ్యూహం..

తొలిదశలో 70 లక్షల మందికి వ్యాక్సిన్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకా రాగానే రోజుకు 10 లక్షల మందికి వేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలా వారం రోజుల్లో 70 లక్షల మందికి వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇతర టీకాల మాదిరిగా కాకుండా... తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్స్‌ ఇవ్వ డంతోనే కోవిడ్‌–19ను కట్టడి చేయవచ్చు. అందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన 10 వేల మంది ఏఎన్‌ఎంలు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కొక్కరు రోజుకు 100 మందికి టీకా వేస్తారు. అలా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఒకవేళ టీకా ఎక్కడైనా వికటిస్తే తక్షణమే స్పందించేలా నిష్ణాతులైన డాక్టర్లతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి కూడా శిక్షణ ఇస్తారు. ఇప్పటికే టీకా డ్రైరన్‌ నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ను సరిచూసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి చూశారు. 

కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు
కేంద్రం నుంచి రాష్ట్రానికి టీకాలు రాగానే ప్రాధాన్య క్రమంలో ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలో రాష్ట్రంలో 70 లక్షల మందికి టీకాలు వేస్తారు. వారిలో 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు సహా క్షేత్ర స్థాయి ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బం దికి ఇస్తారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయస్సుండి ఇతరత్రా అనారోగ్య సమ స్యలున్న వారికి టీకాలు వేస్తారు.

ఈ మేరకు మొదటి దశ లబ్ధిదారుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి పంపించింది. వ్యాక్సిన్‌ పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. టీకాలకు సంబం ధించి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతి రోజూ ఉన్నస్థాయి సమీక్షలు చేస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందన్న దానిపై తమకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రాగానే వేగంగా వేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి.

టీకాల నిల్వకు జిల్లా కేంద్రాల్లో రిఫ్రిజిరేటర్లు...
టీకాలను నిల్వ ఉంచేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక రిఫ్రిజిరేటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) 20 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలో ఏర్పాటు చేస్తారు. అన్ని పీహెచ్‌సీల్లోనూ సాధారణ రిఫ్రిజిరేటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 70 లక్షల మందికి సరిపోయే టీకాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్‌ వ్యవస్థ మన వద్ద అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిం చింది. ఇవన్నీ మైనస్‌ 20 డిగ్రీలలోపు వరకు సామర్థ్యంతో ఉంటాయి. 

సెకండ్‌ వేవ్‌... వ్యాక్సిన్‌పైనే దృష్టి 
ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా సెకండ్‌ వేవ్‌ నియం త్రణ, వ్యాక్సిన్‌ పంపిణీపైనే దృష్టిసారించింది. ఈ రెండిం టినీ ఒకేసారి నిర్వహించడం ఇప్పుడు మా ముందున్న కీలకమైన సవాల్‌. టీకాను ఎంత వేగంగా ఇస్తే అంత త్వరగా కరోనాను నియంత్రిం చగలం. పైగా రెండు డోసులు ఇవ్వాల్సి ఉన్నందున యాంటీబాడీస్‌ తయా రుకావడానికి సమయం కూడా పడుతుంది. అందువల్ల వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రజలు మాస్క్‌ పెట్టుకో వాలి. 
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు 

టీకాలు వేసేందుకు 10 వేల మంది 
ఏఎన్‌ఎంలు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కొక్కరు రోజుకు 100 మందికి టీకా వేస్తారు. ఎక్కడైనా వికటిస్తే 
తక్షణమే స్పందించేందుకు నిపుణులైన డాక్టర్లతో ప్రత్యేక బృందాన్ని 
ఏర్పాటు చేస్తారు.

ప్రాధాన్య క్రమం: తొలుత 3 లక్షల మంది డాక్టర్లు, నర్సులు, వైద్యారోగ్య క్షేత్రస్థాయి సిబ్బంది. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్లు పైబడిన వారికి ఇస్తారు. తర్వాత అనారోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి వేయాలనేది నిబంధన. బీపీ, షుగర్, జీవనశైలి, ఇతర వ్యాధులున్న వారి జాబితాను రూపొందించడమే సమస్య.

టీకా ఎప్పుడొస్తోంది?: అధికారికంగా ఇంకా తేదీ ఏమీ ప్రకటించలేదు. 
అయితే మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు 
రోజుల కిందట ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. శాస్త్రవేత్తల నుంచి 
గ్రీన్‌సిగ్నల్‌ రాగానే వ్యాక్సిన్‌ విడుదల ఉంటుందన్నారు.

కత్తిమీద సాములా పంపిణీ..
కరోనా తీవ్రత ప్రాంతానికి, దేశానికో రకంగా ఉంది. వైరస్‌ ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రాణహాని కలిగిస్తుంటే, కొన్నిచోట్ల సాధారణంగా వచ్చి పోతోంది. టీకా పంపిణీ వ్యూహం అందుకు తగ్గట్లుగానే ఉంటుంది. మన దేశంలో మొదటి దశలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణ యించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మందికి ఇస్తారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారితో పాటు.. ప్రాధాన్యత క్రమంలో 50 ఏళ్ల లోపు అనా రోగ్య సమస్యలున్న వారికి కూడా వేయాలన్నది నిబంధన. అయితే వీరిని ఎలా గుర్తిం చాలో వైద్య ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారింది. బీపీ, షుగర్, జీవనశైలి వ్యాధులు సహా ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించి జాబితా తయారు చేయడంపై గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్‌ పక్కదారి పట్టే చాన్స్‌ ఉందని అధికారులు భయపడుతున్నారు. దీనిపై నిఘా పెట్టి నా రాజకీయ ఒత్తిడులు ఉంటాయని అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top