యువతరంపై మళ్లీ కోవిడ్‌ పంజా!

Covid: 60 percent of Positive Cases Registered are under 35 years - Sakshi

కోవిడ్‌ బాధితుల్లో 60 శాతం మంది 40 ఏళ్లలోపు వారే

ఏమీ కాదనే నిర్లక్ష్యమే కొంపముంచుతున్న వైనం

సెకండ్‌వేవ్‌కు తోడైన చలి..అప్రమత్తతే శ్రీరామరక్ష 

సాక్షి, సిటీబ్యూరో: యువతరంపై మళ్లీ కోవిడ్‌ పంజా విసురుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో ఆఫీసుకు వెళ్లాల్సి రావడం, కాయగూరలు, నిత్యావసరాల కొనుగోలు పేరుతో మార్కెట్ల చుట్టూ తిరుగుతుండటం, పార్టీలు, ఫంక్షన్ల పేరుతో రాత్రి పొద్దుపోయే వరకు జనసమూహంలో గడుపుతుండటం, భౌతిక దూరం పాటించక పోవడమే కాదు...చివరకు మాస్కులు కూడా ధరించక పోవడంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తోంది. తాజాగా వైరస్‌కు చలి తోడవడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కూడా ప్రారంభం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కూడా లేకపోవడంతో వైరస్‌ నిర్ధారణ అయిన పాజిటివ్‌ బాధితులు కూడా బయట తిరుగుతున్నారు. వీరు బయటి నుంచి వైరస్‌ను మోసుకొచ్చి...ఇంట్లో ఉన్న మహిళలకు, వృద్ధులకు విస్తరింపజేస్తున్నారు. చదవండి: కరోనా మళ్లీ వస్తుందా...!

జన సమూహంలో సంచరిస్తూ... 
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 247284 మంది కోవిడ్‌ బారినపడగా, వీరిలో 226646 మంది ఇప్పటికే కోలుకున్నారు. 1366 మంది మృతి చెందారు. బాధితుల్లో 70 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం 19272 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీరిలో 16522 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జూలై నుంచి అక్టోబర్‌ మధ్యలో కేసుల సంఖ్య తగ్గడంతో ఇక వైరస్‌ ముప్పు తప్పిపోయిందని భావించి, వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. నిజానికి కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందని వైరస్‌ తీవ్రత కాదని గుర్తించాలి. ఇదిలా ఉంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు హోం ఐసోలేషన్‌లో ఉండకుండా యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు. వైరస్‌ను ఇతరులకు విస్తరింపజేస్తున్నారు. అంతేకాదు చాలా మంది టెస్టులు కూడా చేయించుకోవడం లేదు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: సెకండ్‌ వేవ్‌.. తస్మాత్‌ జాగ్రత్త! 

కోవిడ్‌ బాధితులు ఇలా...(శాతంలో..)

వయసు మొత్తం  పురుషులు మహిళలు
పదేళ్ల లోపు వారు 4.15 2.14 2.01
11 నుంచి 20 ఏళ్లలోపు 9.03  5.02 4.01
21 నుంచి 30 ఏళ్లలోపు 23.66 14.65 9.02 
31 నుంచి 40 ఏళ్లలోపు 23.04 14.72 8.32 

  
            
            
            
            

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top