– తిరుప్పూర్ వేదికగా హామీల వరాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని నేతన్నలు,రైతన్నలకు తిరుపూర్‌వేదికగా టీవీకే అధినేత విజయ్ మంగళవారం వరాలు కురిపించారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపూర్ జిల్లాలోని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంగళవా రం ప్రచారం నిర్వహించారు. పెరుమానల్లూరులో భారీ బహిరంగ సభలోఅభ్యర్థులను పరిచయం చేశారు. ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించేలా ఆయన కీలక హామీలను ప్రకటించారు. ముఖ్యంగా తమిళనాడు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న నేత, రైతన్నల కోసం ఆయన వరాలు జల్లులు కరిపించారు. నేతన్నల కోసం శ్రీఈ–కామర్స్‌శ్రీ విప్లవం పేరిట తమిళనాడు చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. చేనేత రంగంలో తయారు చేసిన దుస్తులను విదేశాల్లో విక్రయించడానికి ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఈ–కామర్స్ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.
50 శాతం సబ్సిడీ
నేత కార్మికుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి నూలు ,రంగుల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు.చేనేత మగ్గాలు కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామని చెబుతూ రైతులకు కొన్ని హామీలు ఇచ్చారు. పంటల సాగు నుండి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం రైతులకు తోడుగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
పోలీసుల సంక్షేమం
శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకుంటామని విజయ్ తెలిపారు. పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని, వారి విధుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రోటెటింగ్ పద్ధతిలో సెలవులు అందజేస్తామన్నారు. ప్రజల కష్టాలను తీర్చడమే నా రాజకీయ లక్ష్యం. కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తాననని స్పష్టం చేశారు. నేతన్నల కళ్ళలో ఆనందం చూడటమే తమ ద్రావిడ జాతీయవాద లక్ష్యం్ఙ అని విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కేరింతలతో పెరుమానల్లూరు ప్రాంతం మార్మోగిపోయింది. విజయ్ ఇచ్చిన ఈ హామీలు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన తిరుపూర్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. కొంగు మండలం బంగారాలు అంటూ అక్కడి ప్రజలను పలకరిస్తూ ఆయన రోడ్ షోను నిర్వహించారు. ఈ రోడ్ షోకు అమితస్పందన రావడం విశేషం.


