గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్‌ చిత్ర ట్రైజర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్‌ చిత్ర ట్రైజర్‌ విడుదల

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

తమిళసినిమా: ప్రముఖ చాయాగ్రహకుడు,దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ చిత్రాలకు ప్రత్యేకత ఉంటుంది. కాగా ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్‌. రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్‌ నటుడు రాజ్‌ తరుణ్‌, భరత్‌, ఆరి అర్జునన్‌, సునీల్‌శెట్టి, రాధారవి, కిశోర్‌, పాల్‌ డబ్బా, అమ్ము అభిరామి, ప్రసన్న బాలచందర్‌, భరత్‌ సినీ, విజేత వశిష్ట్‌, ఇమాన్‌ అన్నాచ్చి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైజర్‌ (ట్రైలర్‌ ప్లస్‌ టీజర్‌)ను మంగళవారం విడుదల చేశారు. దీన్ని దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ తన సామాజిక మాద్యమం ద్వారా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అభిస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్రైజర్‌లో యాక్షన్‌తో పాటు, సెంటిమెంట్‌, భావోద్రేకాలతో కూడిన సన్నివేశాలు చోటు చేసుకున్నాయని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా దీనికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, విజయ్‌మిల్లన్‌ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. గాడ్స్‌ అండ్‌ సోల్జర్స్‌ చిత్రం ప్రేక్షకులకు సరి కొత్త అనుభవాన్ని కలిగిస్తుందనే నమ్మకాన్ని యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేశారు.

తమిళసినిమా: సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా మంచి హిట్‌ కొట్టి చాలా కాలమే అయ్యింది. కాగా ఈయన ఇంతకు నటించిన హ్యాపీరాజ్‌ మంచి సక్సెస్‌నే అందుకుంది. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని లార్క్‌ స్టూడియోస్‌ సంస్థతో కలిసి జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు చెందిన పారలల్‌ యూనివర్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. లార్స్‌ స్టూడియోస్‌ సంస్థ ఇంతకు ముందు గరుడన్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి హరిహరన్‌రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు జో వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈయన చెప్పిన కథ నచ్చడంతో జీవీ.ప్రకాశ్‌కుమార్‌, లార్క్‌ స్టూడియోస్‌ సంస్థ చిత్రాన్ని నిర్మించడానికి సిద్దం అయ్యారు. ఇందులో జో చిత్రం ఫేమ్‌ మాళవిక మనోజ్‌ నాయకిగా నటించనున్నారు. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, తేని ఈశ్వర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతన్నాయని, జూన్‌ నెలలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ సభ్యులు వెల్లడించారు. ఇది జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అందులో పేర్కొన్నారు.

హీరోగా మరో చిత్రానికి రెడీ అవుతున్న జీవీ

Advertisement
 
Advertisement
Advertisement