కొరుక్కుపేట: సీ్త్రలే సమాజానికి మూల స్తంభాలని విశ్వఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జడ విశ్వవాణి అన్నారు. చైన్నె కొరుక్కుపేట, కామరాజనగర్ సీ బీఎఫ్ సంఘ నాయకురాలు, విశ్వ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జడ విశ్వ వాణిని సంఘ, సాంఘిక సేవలను గుర్తించిన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్, దెబోరా విమెన్ ఫెలోషిప్, దెబోరా యూత్ వింగ్‌లు మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
విజయవంతంగా వాకథాన్
సాక్షి, చైన్నె: హష్పర్ ఇండియా, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన, మహిళల ఆరోగ్యం, మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా ఆదివారం 2 కే 26 నినాదంతో వాకథాన్‌ను చైన్నెలో విజయవంతంగా నిర్వహించారు. ఓమందూరార్ మెడికల్ కాలేజీ గ్రౌండ్ సమీపంలోని నేపియర్ బ్రిడ్జి వద్ద మహిళా దినోత్సవ వాకథాన్‌గా జరిగిన 2కె 26 కు అనూహ్య స్పందన లభించింది .ఇందులో ఈరోడ్ మహేష్, అపోలో ఆసుపత్రి డాక్టర్ సుశీల, విద్యా రాధాకృష్నన్ హష్పర్ వ్యవస్థాపకురాలు మోని వెంకటేష్ వంటి ప్రముఖులు హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఇందులో 5కె, 3కె , 1కె వాక్ థాన్ లో మహిళలు ఉత్సాహంగా దూసుకెళ్లారు.
కొడవలితో నరికి హత్య
అన్నానగర్: నాగై జిల్లా తిరుమరుగల్ యూనియనన్‌లోని మరుంగూర్ అచ్యుతన్ కోవిల్ వీధికి చెందిన పెరియార్ధసన్ (48) మరుంగూర్ కడై వీధిలో చికెన్ దుకాణం నడుపుతున్నాడు. మరుంగూర్ నదుత్ వీధి నివాసి గోపాలకృష్ణన్ (37) పెరియార్ధసన్ వద్ద పనిచేస్తున్నాడు. ఈనెల 1న మద్యం తాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం జరిగింది. కోపంతో ఉన్న గోపాలకృష్ణన్ మాంసం కోసేందుకు దుకాణంలో ఉంచిన కత్తిని తీసుకుని పెరియార్ధసన్ తలపై నరికాడు. రక్తపు మడుగులో ప్రాణాలకు పోరాడుతున్న పెరియార్ధసన్‌ను పొరుగువారు రక్షించి నాగపట్నం ఒరత్తూర్‌కు తరలించారు. వారిని చికిత్స కోసం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న పెరియార్ధసన్ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. పోలీసులు గోపాలకృష్ణను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


