తిరువళ్లూరు: ఆరణి అత్తికుళం ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరవరాహీ సమేత ఉన్మత్ భైరవర్ ఆలయ కుంభాబిషేకం ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా ఆరణి సమీపంలోని అత్తికుళం గ్రామంలో ప్రసిద్ధి చెందిన స్వయంభూ ఓం శ్రీ వీరవరాహీ అమ్మవారి ఆలయం ఉంది. ఆలయంలో అమావ్యాస, పౌర్ణమి తదితర రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఇటీవలే పునఃనిర్మాణపు పనులను చేపట్టారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తయిన క్రమంలో మహాకుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్సవాలకు సమీప ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.


