కొరుక్కుపేట: తెలుగుభాష ఉనికిని కాపాడుకోవడానికి సమష్టి కృషిచేయాలని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. తిరువళ్లూర్ జిల్లా ఏఐటీఎఫ్ తరఫున ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీఎఫ్ యువజన విభాగ అధ్యక్షుడు ఆర్ దామోదరన్, ఉపాధ్యక్షుడు ఎన్ నిర్మల్ చంద్ నేతృత్వంలో అంబత్తూర్ ఎంటీహెచ్ రోడ్డులోని హెచ్‌పీఎం ప్యారడైస్ కల్యాణ మండపంలో జరిగిన ఉగాది వేడుకలకు ఏఐటీఎఫ్ ప్రధానకార్యదర్శి నాయకర్ ఆర్ నందగోపాల్ అధ్యక్షత వహించారు. ఆచార్య సీఎంకే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏఐటీఎఫ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీఎం కిషోర్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.నాగభూషణం పాల్గొన్నారు. పేదలకు 5 కిలోల బియ్యం, దుస్తులు వితరణగా ఇచ్చారు.


