పిల్లలను కడతేర్చి.. తండ్రి ఆత్మహత్య
వేలూరు: భార్యపై అనుమానంతో వ్యక్తి ఇద్దరు పిల్లలను హత్య చేసి, తను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా తెల్లూరు గ్రామం పిల్లయార్ ఆలయ వీధికి చెందిన క్రిష్ణన్(44), పూంగొడి దంపతులకు కయల్‌వియి(9), నిదర్శన్(7) ఇద్దరు పిల్లలున్నారు. క్రిష్ణన్ పలు సంవత్సరాల క్రితం చైన్నెకి కుటుంబ సభ్యులతో వెళ్లి, పలు చోట్ల కూలి పనులు చేసుకునే వాడు. క్రిష్ణన్ తన భార్యపై అనుమానం ఏర్పడడంతో తరచూ ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. దీంతో పూంగొడి తన భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. గత ఆరు నెలలుగా పూంగొడి భర్త, ఇద్దరు పిల్లలను వదిలి పెట్టి వెళ్లడంతో ఇద్దరు పిల్లలతో ఉన్న క్రిష్ణన్ మనో వేదనకు గురయ్యాడు. ఇదిలావుండగా దీపావళి పండుగకు తన ఇద్దరు పిల్లలతో సొంత గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి చైన్నెకి వెళ్లలేదు. భార్య లేని కారణంగా తరచూ మద్యం సేవించే వాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన క్రిష్ణన్ బంధువుల ఇంట్లో ఆటలాడుతున్న ఇద్దరు పిల్లలను పిలిచి ఇద్దరికి భోజనం వడ్డించాడు. అనంతరం ముగ్గురూ కలిసి ఇంట్లో తలుపులు వేసుకుని నిద్రించారు. ఇద్దరు పిల్లలు తన తండ్రి పక్కనే పడుకుని గాఢంగా నిద్ర పోయారు. అర్ధరాత్రి సమయంలో తల దిండుతో ఇద్దరి పిల్లల ముఖంపై అదిమి ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం ఒక లేఖను రాసి పెట్టి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని క్రిష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరవక పోవడంతో స్థానికులు సేత్తుపట్టు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మృత దేహాలుగా కనిపించడంతోపాటు క్రిష్ణన్ ఫ్యాన్‌కు వేలాడుతుండడాన్ని గమనించి మృత దేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంట్లో పరిశీలించగా ఒక లేఖ ఉండగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లేఖను చదివారు. అందులో తన భార్యకు పిల్లలపై ఏ మాత్రం ప్రేమ లేదని, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వదిలి పెట్టిందని, దీంతోనే తన పిల్లలు అనాథలుగా బతకడం ఇష్టం లేక పోవడంతోనే ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో రాశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కయల్‌వియి(ఫైల్)
తండ్రి క్రిష్ణన్(ఫైల్)
నిదర్శన్(ఫైల్)
పిల్లలను కడతేర్చి.. తండ్రి ఆత్మహత్య
పిల్లలను కడతేర్చి.. తండ్రి ఆత్మహత్య


