బకింగ్ హామ్‌తో వరద ముప్పు
– అధికారులు ప్రత్యేక దృష్టి
సాక్షి, చైన్నె : బకింగ్ హామ్ కాలువ రూపంలో వర ద ముప్పు రానున్న కాలంలో చైన్నెకు ఏర్పడే ప్ర మాదం ఉందన్న హెచ్చరికలు రావడంతో అధికా ర యంత్రాంగం అలర్ట్ అయింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించే పనిలో ప డ్డారు. చైన్నె ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో వ రద ముంపునకు గురి కాకుండా జాగ్రత్తలను అధి కారులు విస్తృతం చేసిన విషయం తెలిసిందే. కూ వం, అడయార్ నదీ తీరాల్లో పూడిక తీత ముగించారు. ఆ తీరం వెంబడి ప్రాంతాలను ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే, అడయార్ నది ముఖ ద్వారం వద్ద సైతం పూడిక తీత శరవేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బకింగ్ హామ్ కాలువను అధికారులు మరిచినట్టుగా సమాచారం వెలువడింది. బకింగ్‌హామ్ కాలువ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, చైన్నెలో 31 కి.మీ దూరం ఈ కాలువ ప్రవహిస్తోంది. ఓఎంఆర్ రోడ్డులో జరుగుతున్న మెట్రో రైలు పనుల దృష్ట్యా, అనేక చోట్ల బకింగ్ హామ్ కాలువలో చెత్త చెదారాలు చేరగా, మరికొన్ని కొన్ని చోట్ల పూడిక తీత అస్సలు సాగలేదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇక, మైలాపూర్, మందవెలి, రాయపేట, అడయార్ పరిసరాల్లో కాలువ ఆక్రమణకు గురైనట్టుగా వెడల్పు తగ్గింది. తాజాగా కూవం, అడయార్‌లో వరదపై దృష్టి పెట్టిన అధికారులు, బకింగ్ హామ్‌ను గాలికి వదిలేసిన దృష్ట్యా, ఈసారి దక్షిణ చైన్నె పరిధిలోని వరద ముంపు తప్పదన్న హెచ్చరికలు తెర మీదకు వచ్చాయి. అలాగే పళ్లికరణై పరిసరాల్లో సైతం నెలకొన్న పరిస్థితులతో ఈ సారి చైన్నె నగరంలో ఐటీ సంస్థలతో పాటుగా పలు కార్యాలయాలు, ఎత్తైన భవనాలతో నిండిన తరమణి పరిసరాలకు బకింగ్ హామ్ కాలువ రూపంలో వరద ముంపు తప్పదన్న సామాజిక కార్యకర్తల హెచ్చరికతో అఽధికారులు అలర్ట్ అయ్యారు. బకింగ్ హామ్ తీరంపై పరిశీలనకు కసరత్తు చేపట్టారు. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం బయలు దేరేందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్న దృష్ట్యా, అంతలోపు బకింగ్ హామ్ తీరంలో ముందు జాగ్రత్తల దిశగా పరుగులు తీస్తున్నారు.


