హిర్దు హారూన్‌ హీరోగా టెక్సాస్‌ టైగర్‌ | - | Sakshi
Sakshi News home page

హిర్దు హారూన్‌ హీరోగా టెక్సాస్‌ టైగర్‌

Jun 30 2025 4:03 AM | Updated on Jun 30 2025 4:03 AM

హిర్ద

హిర్దు హారూన్‌ హీరోగా టెక్సాస్‌ టైగర్‌

తమిళసినిమా: కేన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు అందుకున్న ఆల్‌ వుయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ చిత్రం ఫేమ్‌ హిర్దు హారూన్‌ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం టెక్సాస్‌ టైగర్‌. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన ఫ్యామిలీ చిత్రం ఫెమ్‌ సెల్వకుమార్‌ తిరుమారన్‌ కథ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రాన్ని యూకే స్వార్డ్‌ పతాకంపై సుజిత్‌ బాలాజీకుమార్‌, భారతికుమార్‌ ,సెల్వకుమార్‌ తిరుమారన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలై చక్కని భావోద్వేగాలతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టెయినర్‌ కథాంశంతో కూడిన ఫ్యామిలీ చిత్రాన్ని వీరే నిర్మించడం గమనార్హం. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న టెక్సాస్‌ టైగర్‌ చిత్ర టీజర్‌ వీడియోను యూనిట్‌ వర్గాలు విడుదల చేశాయి. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఈ టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

హిర్దు హారూన్‌ హీరోగా టెక్సాస్‌ టైగర్‌ 1
1/1

హిర్దు హారూన్‌ హీరోగా టెక్సాస్‌ టైగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement