స్ఫూర్తి ప్రదాత హెలెన్‌ కెల్లర్‌ | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి ప్రదాత హెలెన్‌ కెల్లర్‌

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

స్ఫూర్తి ప్రదాత హెలెన్‌ కెల్లర్‌

స్ఫూర్తి ప్రదాత హెలెన్‌ కెల్లర్‌

కొరుక్కుపేట: మహిళల ఓటుహక్కు, కార్మికుల హక్కులు, ప్రపంచశాంతి కోసం విస్తృత ప్రచారం చేయడంతోపాటు తన జీవితాంతం దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలన్‌ కెల్లర్‌ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని ఎంఎన్‌ కంటి ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శృతి పేర్కొన్నారు. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం 64 ఏళ్లుగా సేవలందిస్తున్న నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్‌లైండ్‌ తమిళనాడు రాష్ట్రశాఖ (ఎన్‌ఏబీ– టీఎన్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో హెలెన్‌ కెల్లర్‌ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆ శాఖకు చెందిన నీనారెడ్డి నేతృత్వంలో సవేరా వేదికగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్‌ శృతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెలెన్‌ కెల్లర్‌ ఒక అమెరికన్‌ రచయిత్రి, రాజకీయ కార్యకర్త, లెక్చరర్‌ అయిన ఆమె అనారోగ్యం కారణంగా చిన్న వయస్సులోనే చెవిటి, అంథురాలయ్యారని, అయినా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీని సంపాదించిన మొదటి చెవిటి– అంథురాలిగా నిలిచారని గుర్తు చేశారు. వైకల్యం ఉన్నా ప్రతీ బిడ్డా నాణ్యమైన విద్యను పొందే హక్కును కల్పించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌ను ఘనంగా సత్కరించగా, స్పెషల్‌ స్కూల్స్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినంది, సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement