అనల్‌ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం | - | Sakshi
Sakshi News home page

అనల్‌ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

అనల్‌

అనల్‌ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం

తమిళసినిమా: ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకుడిగా మెగా ఫోన్‌ పట్టి తెరకెక్కించిన తొలి చిత్రం ఫీనిక్స్‌. ఈ చిత్రం ద్వారా స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి వారసుడు సూర్య విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఏకే.బ్రేవ్మెన్‌ పిక్చర్స్‌ పతాకంపై రాజ్యలక్ష్మి అనల్‌ అరసు నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని మే 4వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్రం ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక వడపళనిలోని పలోజో థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో నిర్మాత కలైపులి ఎస్‌.ధాను, టీ.శివ, దర్శకుడు హెచ్‌ వినోద్‌, పాండిరాజ్‌, ఫెఫ్సీ విజయన్‌, శక్తి ఫిలింస్‌ శక్తివేలన్‌, నటుడు విజయ్‌ సేతుపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ఫైట్‌ మాస్టర్‌ ఆనల్‌ అరసు ఈ చిత్రం కథను తనకు 2018లోనే చెప్పారన్నారు. అయితే అప్పట్లో తాను నటించలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ తర్వాత మీ అబ్బాయి సూర్య ఈ కథలో నటిస్తే ఎలా ఉంటుంది అని అడిగారన్నారు. దీంతో తనకు ఒకపక్క సంతోషం మరో పక్క భయం కలిగిందన్నారు. అయితే తన కొడుకు సూర్యకు సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకోవాలని భావిస్తానన్నారు. అతనికి కథ వినమని చెప్పానన్నారు. ఆ తర్వాత ఆ విషయం గురించి తానేమి చెప్పలేదన్నారు. అయితే తన సినిమా అనుభవాలను తన కుటుంబ సభ్యులతో పంచుకుంటానని చెప్పారు. అందుకే సూర్యకు సంబంధించిన విషయాల్లో తనే నిర్ణయం తీసుకోవాలని భావించానని చెప్పారు. అందువల్లే తాను ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతోపాటు ఏ విషయాల్లోనూ పాల్గొనలేదని చెప్పారు. అయితే నటించడం మొదలు పెట్టిన తర్వాత సంతోషంగా ఉందా? అని తన కొడుకు సూర్యను అడగ్గా.. ఉందని చెప్పారన్నారు. అతనికి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన వారందరికీ ధన్యవాదాలన్నారు. స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయం కావడం అతని భాగ్యంగా పేర్కొన్నారు. దర్శకుడిగా పరిచయం అయిన అనల్‌ అరసు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం తన తండ్రిని పేర్కొన్నారు. తన సతీమణి రాజ్యలక్ష్మి లేకపోతే ఈ చిత్రమే లేదని ఆయన అన్నారు.

అనల్‌ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం1
1/1

అనల్‌ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement