విజయ్‌ @ 51 | - | Sakshi
Sakshi News home page

విజయ్‌ @ 51

Jun 23 2025 5:58 AM | Updated on Jun 23 2025 5:58 AM

విజయ్

విజయ్‌ @ 51

రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

టీవీకేలో పండుగ సంబరాలు

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ ఆదివారం 51వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భాన్ని పండుగ తరహాలో ఆ పార్టీ వర్గాలు జరుపుకున్నాయి. వాడ వాడలలో వేడుకలు, సేవలు మిన్నంటాయి. వివరాలు. సినీ నటుడిగా అశేషాభిమానుల హృదయాలలో ముద్ర వేసుకున్న దళపతి విజయ్‌ గత ఏడాది రాజకీయాలోకి వచ్చారు. ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగంను ప్రకటించినా, కొన్ని నెలల పాటుగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేదు. గత ఏడాది చివరి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యవర్గాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు విజయ్‌ సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన తొలి బర్తడేను జరుపుకుంటుండటంతో పార్టీ వర్గాలకు పండుగగామారింది. విజయ్‌ 51వ పుట్టిన రోజును సేవా కార్యక్రమాల రూపంలో హోరెత్తించారు. రాష్ట్రంలో 120 మేరకు జిల్లా కమిటీలు, 20 మేరకు ఉన్న అనుబంధ విభాగాల ద్వారా విజయ్‌ బర్త్‌డే వేడుకలు పండుగ తరహాలో మిన్నంటాయి.

బంగారు ఉంగరాలు..

పుట్టిన పిల్లలకు బంగారు ఉంగారాలను అందజేశారు. గర్భిణి సీ్త్రలు, చంటి పిల్లల తల్లులకు కావాల్సిన అన్నిరకాలవస్తువులను పంపిణీ చేశారు. విజయ్‌ తల్లి శోభ ఉదయాన్నే స్థానికంగా ఉన్న ఆలయంలో పూజలు చేశారు. విజయ్‌ సీఎం కావాలన్న కాంక్షతో ఆ పార్టీ వర్గాలు ఎక్కడిక్కడ ఆలయాలలో పూజలు హోరెత్తించారు. సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. అన్నదాతనం, రక్తదానం, వస్త్ర, ఇతర వస్తువుల దానంతో పేదలకు ఉపయోగ పడే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, పనయూరులోని విజయ్‌ ఇంటి వద్ద కు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. చైన్నెలో జరిగిన కార్యక్రమాలలో పార్టీ నేతలు భుస్సీ ఆనంద్‌, ఆదవ్‌ అర్జునలు పాల్గొన్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనాథ ఆశ్రమాలకు కావాల్సిన వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులలో పుట్టిన వందలాది మంది పిల్లలకు బంగారు ఉంగరాలను పార్టీ వర్గాలు అందజేసి ఆనందాన్ని పంచుకున్నారు. వాడ వాడలలో స్వీట్లు పంపిణీతో సంబరాలలో మునిగారు. ఇక, విజయ్‌ తదుపరి చిత్రం జననాయగం పోస్టర్లు సామాజికమాధ్యమాలలో హల్‌చల్‌ చేశాయి. ఇదిలా ఉండగా విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులు పోస్టర్లు, ప్లెక్సీలను హోరెత్తించగా, పోలీసుల హఠాత్తుగా నిషేధం విధించడం పలు చోట్ల వివాదానికి దారి తీసింది. కొన్ని చోట్ల విజయ్‌ మద్దతు దారులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేయడం రచ్చకెక్కింది. ఇక విజయ్‌ బర్త్‌డే వేళ మంచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ మహిళ నేత తమిళిసై సౌందరారజన్‌ పిలుపునిచ్చారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్‌ నేత సెల్వ పెరుంతొగై, పీఎంకే నేత అన్బుమణి, నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయ్‌ @ 51 1
1/1

విజయ్‌ @ 51

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement